![]()
యూరియా వాడకం తగ్గించాలి : కేవీకే శాస్త్రవేత్త నవీన్ కుమార్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 16
టేపులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు పంటలపై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్ కుమార్, శ్రీనివాసరావు, ఇల్లెందు ఏడీఏ లాల్ చందు, ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ..రైతులు లోతు దుక్కులు దున్నడం వల్ల కీటకాలు నశిస్తాయని తెలిపారు. పంటలు వేశాక అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు వస్తుందని, యూరియా వాడకం తగ్గించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


