![]()
ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 20
మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఏప్రిల్ 27 న వరంగల్ లోని హన్మకొండ, ఎల్కతుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


