![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 24
మండలంలోని చింతల్లంక
గ్రామపంచాయతీ రాజుతండాలో సోమవారం ఓ ఇల్లు పట్టపగలు చోరీకి గురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మెంతెన శేషగిరి అనే వ్యక్తి ఆర్ఎంపి వైద్యుడు. సొంత పనుల నిమిత్తం భార్య, భర్తలు ఇద్దరు వేరే ఊరెళ్ళారు. ఇంటికి తాళం వేసినా కూడా ఇంటి తాళం పగలగొట్టకుండానే చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఇంటి వెనుకాల నుంచి మెస్ డోర్ పగలగొట్టి, తలుపు గడియ తీసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, డెబ్భై వేల రూపాయల నగదును అపహరించారని బాధితులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న ఇంటి యజమాని శేషగిరి భార్య శ్వేత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగతనంపై విచారణ చేపట్టారు. సంఘటన ప్రదేశానికి క్లూస్ టీమ్ చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు.


