Monday, March 23, 2026
HomeTelangana NewsMuluguరామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

Loading

ములుగు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09

హైదారాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ఆదివారం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్షర యోధుడు రామోజీరావు అని, మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడిని సృష్టించారని, తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి, దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుందని, పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలు మరువలేనివాని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలనీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page