Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరుణమాఫీలో పెట్టిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలి

రుణమాఫీలో పెట్టిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Loading

రుణమాఫీలో పెట్టిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలి

-సేవాలాల్ సేన జిల్లా కో-కన్వీనర్ డిమాండ్

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ లలో ఇటీవల ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీఈవో మాత్రం అన్ని మండలాల్లో ఉన్న డీసీసీబీ సీఈఓలకు మాత్రం షరతులతో కూడిన నిబంధనలు పెట్టి రైతులను, బ్యాంక్ అధికారులను ఇబ్బందులు పెడుతున్నారని శనివారం సేవాలాల్ సేన జిల్లా కో-కన్వీనర్ మాలోతు శివ నాయక్ ఆరోపించారు. దానివల్ల అధికారులు ఈ పత్రాలు, ఆ పత్రాలని చెప్పి పలుమార్లు రైతులను తిప్పుతున్నారని, ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో ఆలోచించి రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులకు సూచించాలని కోరారు. కొంతమంది అధికారులు పోడు, అసైన్మెంట్, జంగ్ సిపాయి పట్టాలకు రెండు బ్యాంకులలో రుణాలు ఉంటే రుణమాఫీ కాదని చెప్పి రైతులను భయపెడుతున్నారని, కాబట్టి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీని ఇవ్వాలని, లేనిపక్షంలో అన్ని డీసీసీబీ కేంద్రాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల విషయంలో ఇబ్బందులు పెట్టకుండా చూడాలని ధారావత్ కృష్ణ నాయక్, బాలాజీ నాయక్, రాజు నాయక్ లు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page