![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 16
తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సి కమీషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ ఆహ్వనం మేరకు గురువారం టీఎస్ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏజన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల హెచ్ఎస్ఏ, ఏహెచ్ఎస్ఏ, ఎస్సీఏ పెంపుదలపై ప్రతినిధుల సభ్యులు చర్చలు నిర్వహించారు. టీఎస్ ఏటీఎఫ్ ప్రతినిధి సభ్యులు హైదరాబాద్ వెళ్లి ఏజన్సీ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించి 42 శాతం ఫీట్మెంట్ తదితరు అంశాల గురించి వినతి పత్రాన్ని కమీషన్ చైర్మన్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంజ క్రిష్ణ, జిల్లా అధ్యక్షులు పాయం ఆనందరావు, ఊకె క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.


