![]()
గుండాల: రేపు బుధవారం గుండాల మండల కేంద్రంలో ది ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రణీత్ సౌజన్యంతో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త మానాల వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులకు సరైన అవగాహన లేక, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారని, ఈ రైతు సదస్సు ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చి, అధిక దిగుబడి తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ రైతు సదస్సును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రైతు సదస్సులో శాస్త్రవేత్తలు, జిల్లా, మండల వ్యవసాయ అధికారులు పాల్గొంటారని, కావునా మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


