Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరేపు మణుగూరులో దివ్యాంగులకు రాయితీ బస్సు పాస్ మేళ

రేపు మణుగూరులో దివ్యాంగులకు రాయితీ బస్సు పాస్ మేళ

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూలై 29

మండలంలోని దివ్యాంగులకు మంగళవారం సురక్ష బస్టాండ్ నందు ఉదయం 10 గంటలకు బస్సు పాస్ మేళ నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కుదిరుపాక శ్యామ్ సుందర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ బస్సు పాసుతో డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో 50% రాయితీతో తెలంగాణ రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని, ఈ రాయితీ బస్సు పాసు కావాల్సిన వారు సదరం సర్టిఫికెట్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, ఒక పాస్ ఫోటో మరియు 50 రూపాయలు తీసుకొని రాగలరని కోరారు. పూర్తి వివరాలకు 7382859142, 7659823007 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page