![]()
- ఇల్లందుకు రానున్న మంత్రులు పొంగులేటి, సీతక్క
- సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు దక్కాలంటే రేషన్ కార్డే కీలకం. ఎన్నో ఎళ్ళ నుండి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ మేరకు లబ్దిదారులకు రేషన్ కార్డు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్న తరుణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు పట్టణంలోని సింగరేణి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగసభకు ముఖ్యఅతిథులుగా రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూర్య, ఎంపీ బలరాం నాయక్ లు ఇల్లందుకు రానున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సభాస్థలి ఏర్పాట్లను ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పరిశీలించి
కమిటికి పలుసూచనలు చేశారు. దాదాపు ఐదువేల మంది హాజరయ్యే ఈ బహిరంగసభకు ప్రజలు, లబ్దిదారులు, కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పట్టణ అధ్యక్షుడు దొడ్డ దానియల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోరం సురేందర్, ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు, మండల మాజీ వైస్ ఎంపిపి మందలరాము, మండలపార్టీ అధ్యక్షులు పులినైదులు, టేకులపల్లి సొసైటి చైర్మెన్ లక్కినేని సురేందర్, నాయకులు మాడుగుల సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, అరెం కిరణ్, తాటి బిక్షం, చిల్లా శ్రీనివాసరావు, గణేష్, ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉఫాధ్యక్షులు ఈసం లక్ష్మణ్, మూతిక్రిష్ణ, బండి ఆనంద్, దండుగుల శివ, తదితరులు పాల్గొన్నారు.


