![]()
రైతులకు ఎరువులు విత్తనాలు పురుగుమందులు సబ్సిడీ ద్వారా అందించాలి – నాయని రాజు
ఇల్లందు డివిజన్ ప్రధమ మహాసభ డిమాండ్
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 15
ఇల్లందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంధా అనుబంధ సంఘం అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ యు కె ఎస్) ఇల్లందు డివిజన్ ప్రధమ మహాసభ ఎల్లన్న విజ్ఞాన కేంద్రం అమరుడు కామ్రేడ్ గండి యాదన్న నగర్ లో జరిగింది. ఇల్లందు పట్టణంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఇల్లందు నియోజకవర్గానికి అందించాలని ఇల్లందు పట్టణంలో ఎల్లన్న విజ్ఞాన కేంద్రం నుండి ఆమ్ బజార్ పాత బస్టాండ్ మీదుగా ఎల్లన్న విజ్ఞాన కేంద్రానికి చేరుకొని సంఘం జెండాను సంఘం అధ్యక్షులు కామ్రేడ్ శ్రీరాం కోటయ్య ఆవిష్కరించారు.
ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా శ్రీరామ్ కోటయ్య ఈసం శంకర్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సభలో ముఖ్య వక్తగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్ర ఎంకన్న కల్లూరి కిషోర్ హాజరై మాట్లాడుతూ ఎన్నో రైతాంగ సమస్యలు పరిష్కారం కొరకు రాజులేని పోరాటం నిర్వహించామన్నారు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులను నివారించాలన్నారు. మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని గిట్టుబాటు ధరల కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను భారత్ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో రైతు సంఘం కూడా పాల్గొన్నదని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం రైతు ఉద్యమాలు కూడా భాగస్వామ్య ఉన్నదని మన జిల్లాలో భూములు లేని పేదల కొరకు భూ పోరాటం నిర్వహించి వేలాదికలను ప్రజలకు స్వాధీనం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో అజ్మీరా బిచ్చ, బుర్ర రాఘవులు, గాంధీ ,రాంబాబు, కోటేష్, అజయ్, దేవా, ఈరన్న , ఎదలపల్లి ,సావిత్రి, ముత్తక్క, టియుసిఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి, ఇల్లందు పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న, గొగ్గల వెంకటేశ్వర్లు, సింగన్న రియాజు తదితరులు పాల్గొన్నారు.


