![]()
-జడ్పీటీసీ పోచం నరసింహారావు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 16
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలో భాగంగా రైతులు పండించిన పంటకు 500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం జడ్పీటీసీ పోచం నరసింహారావు మణుగూరు తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఏ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా పండించిన పంటకు వెంటనే బోనస్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరావు, పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఏనుక ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


