![]()
రైతు రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి…
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్.
తిరుమలాయపాలెం,మన భద్రాద్రి,జూన్ 19:
కాంగ్రేసు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక లాగ ఎన్నికలతరువాత ఒక లాగ మాట్లాడటం దురదృష్టకరమని వారు అన్నారు , మీరు ప్రజలకి ఇచ్చిన గ్యారంటీలను పూర్తిగా అమలుచేయాలని, అలాగే రైతులకు రెండు లక్షలరూపాయల రైతు రుణమాఫీ అందరికీ వర్తించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే రుణ మాఫీ అనేది కరక్ట్ కాదని అన్నారు. మోటర్ బైక్ , నాలుగు చక్రాలు తదితర నిబంధనలతో రేషన్ కార్డులు రద్దు చేసారని, అసలు తెల్లరేషన్ కార్డ్ లు రైతులందరికీ లేవని మీరు ఎన్నికల ముందు రేపు ఎన్నికలు అనంగా కూడ రుణం తీసుకోండి మేము వచ్చాక మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని మీరే రైతులను ప్రోత్సఇంచి అప్పులపాలు చేసారని ఇప్పుడు నిబందనలు పెట్టటం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వానా కాలం పంటలు వేస్తున్నాకాని రైతులకు ఇంత వరకు విత్తనాలు కొనుగోలు చేయటానికి రైతు బందు నిధులు కూడ విడుదల చేయలేదని వెంటనే రైతుబందు నిధులు విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేసారు. రైతుల అవసారాలకోసం మరలా ప్రయివేటు వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించవలసిన దుస్ధితి వచ్చిందని కావునా కాంగ్రేసు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని యడల తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయవలసి వుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరంచారు.


