![]()
-మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ శాఖ
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్
మణుగూరు పట్టణంలోని అపోలో మెడికల్ షాప్ ప్రక్కన సుందరయ్య నగర్ కు వెళ్లే దారిలో రోడ్డుకు ఆనుకుని భారీ గుంట ఏర్పడి రోజులు గడుస్తున్నా మణుగూరు మున్సిపాలిటీ అధికారులకు చీమ కుటినట్లు కూడా లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ శాఖ కమిషనర్ నిద్రమత్తు నుండి మేల్కొని రోడ్డు ప్రక్కనే ప్రమాదకరంగా ఉన్న గుంటను పూడ్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.


