![]()
-సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 31
మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల పంట పొలాలకు నీరు సరఫరా చేస్తున్న రోళ్లపాడు చెరువు తూముకు మరియు కుడి, ఎడమ కాలువలకు టెండర్లు నిర్వహించి వెంటనే పనులు ప్రారంభించాలని శుక్రవారం టేకులపల్లిలో జరిగిన కార్యక్రమంలో
సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) సంఘాల ఆధ్వర్యంలో తూముల మరమ్మతులు చేపట్టాలని గతంలో ఆందోళనలు చేసిన నేపథ్యంలో రూ.7.5 లక్షలు మంజూరయ్యాయని, అవి మంజూరై వారం గడుస్తున్నప్పటికీ, టెండర్లు నిర్వహించి పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభం కావస్తుందని, అడపాదడపా కురుస్తున్న వానలకు చెరువు నిండితే నీరు మొత్తం వృథా అయ్యే పరిస్థితి ఉందని వాపోయారు. కావున అధికారులు వెంటనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గుగులోతు రామచందర్, నాయకులు వెంకట్రామ్, ధరావత్ వెంకన్న, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


