Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemలక్ష్మిదేవర బోనాల ఉత్సవాలకు బియ్యం, ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

లక్ష్మిదేవర బోనాల ఉత్సవాలకు బియ్యం, ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Loading

ఏటూరునాగారం, మన భద్రాద్రి న్యూస్, మే 19

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల కాంగ్రెస్ నాయకుల సూచనల మేరకు మండల సహాయ కార్యదర్శి ఈసం జనార్దన్, మండల ఎస్టీ సెల్ సహాయ కార్యదర్శి సోనప కిరణ్ గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారి సహకారంతో మండలంలోని రోహీర్ గ్రామంలో జరుగుతున్న లక్ష్మిదేవర బోనాల ఉత్సవాలకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాభై కేజీల బియ్యం మరియు వేయి రూపాయల ఆర్థిక సహాయం లక్ష్మిదేవర గుడి కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో చేల వెంకటయ్య, చింత రవి, గడిగ రామయ్య, కొడం ప్రభాకర్, గడిగ విశ్వనాథం, తొలం అర్జున్, గడిగ శ్రీకాంత్, అన్యబోయిన రామనాథం, కొడిపె లక్ష్మి, కొడం సమ్మక్క, గడిగ ప్రమీల, గడిగ రమాదేవి, చింత రామక్క, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page