Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్న పాల్వంచ బస్టాండ్

వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్న పాల్వంచ బస్టాండ్

Loading

-ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులు, రాకపోకలకు అంతరాయం

పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్

పాల్వంచ బస్టాండుకు నిత్యం వందలాది మంది ప్రయాణీకులు వస్తుంటారు, వెళ్తుంటారు. బస్టాండ్ బుధవారం వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. వర్షం పడితే చాలు బస్టాండ్ చుట్టూరా రెండు అడుగులకు పైమేరా వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రయాణీకులు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎక్కడ కురిసిన వర్షపు నీరు అక్కడే నిలుస్తుంది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ బస్టాండ్ చిన్నపాటి వర్షానికే జలమయం అవుతుందంటే మున్సిపాలిటీ అధికారుల పనితీరు ఏ రకంగా ఉందో చెప్పనక్కర్లేదని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page