![]()
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
చర్ల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గురువారం పెద్దాడ సత్యం జ్ఞాపకార్థంగా వారి భార్య సుశీల, కుమార్తె రాధ రూ. 8 వేల విలువగల నోట్ బుక్స్ ను విద్యార్థులకు అందజేశారు. చర్ల నోడల్ అధికారి పీవీ రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీహెచ్ వేణుగోపాలరావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులు, కంబాక్స్ లు అందించటం సంతోషకరమన్నారు. ఇలానే ప్రతీ ఒక్కరు పేద విద్యార్థులకు సహాయం అందించాలని సూచించారు. పెద్దాడ సత్యం పెద్ద మనసుతో ఇచ్చిన స్థలంలోనే నేడు ఈ పాఠశాల నడుస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి రాజేశ్వరి, ఎస్ రామారావు, ఈ చంద్రయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


