Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తులు, బ్యాగ్స్, షూస్ పంపిణీ చేసిన పాయం

విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తులు, బ్యాగ్స్, షూస్ పంపిణీ చేసిన పాయం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 04

మండలంలోని వాగు మల్లారం గ్రామం గ్రెస్ మిషన్ పాఠశాలకు గురువారం ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరైనారు. ఎమ్మెల్యేకు పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. అనంతరం పాయం పాఠశాల పిల్లలకు పుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తులు, బ్యాగ్స్, పెన్నులు, షూస్ పంపిణీ చేశారు. పాఠశాల పిల్లలు మంచిగా చదువుకొని, మన దేశ పురోగతికి తోడ్పడాలన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page