Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్యార్థుల పట్ల మానవత్వం చాటుకున్న చర్ల పోలీసులు

విద్యార్థుల పట్ల మానవత్వం చాటుకున్న చర్ల పోలీసులు

Loading

విద్యార్థుల పట్ల మానవత్వం చాటుకున్న చర్ల పోలీసులు

  • గ్రంథాలయానికి ఇన్వర్టర్ ను వితరణగా అందించిన సీఐ, ఎస్సై

చర్ల, మన భద్రాద్రి న్యూస్

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పేద విద్యార్థులు పోటీ పరీక్షల నిమిత్తం గ్రంథాలయంలో చదువుకునే సమయంలో కరెంటు అందుబాటులో లేని సమయంలో విద్యార్థులు పడుతున్నది ఆవేదనను అర్థం చేసుకొని మానవత్వంతో గ్రంథాలయానికి ఇన్వెర్టర్, బ్యాటరీని సిఐ ఏ.రాజు వర్మ, ఎస్సై ఆర్ నర్సిరెడ్డి లు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్ల ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు శాఖ గ్రంథాలయానికి వచ్చి పోటీ పరీక్షలకు పోటీపడి చదువుతున్నారని, వర్షాకాలం దృష్ట్యా గ్రంథాలయానికి వచ్చి చదువుకునే విద్యార్థులకు విద్యుత్ ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశంతో ఇన్వర్టర్ ను అందించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ అవకాశాన్ని ఏజెన్సీలోని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు చుక్క బొట్ల వంశీకృష్ణ, విద్యార్థినీ విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page