Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 18

మండలంలోని తిప్పనపల్లి గ్రామపంచాయతీలోని మహమ్మద్ నగర్ గ్రామంలో శనివారం ఉదయం విద్యుత్ షాట్ సర్క్యూట్ జరిగి ఒక నిరుపేద కుటుంబం ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని షేక్ బడే సాబ్ (జోకర్) మాట్లాడుతూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నానని, ఉదయాన్నే కూలీ పనికి వెళ్లానని, కొడుకు, కోడలు ఇద్దరు ఉపాధి హామీ పనికి వెళ్లగా, నా భార్యకి ఈ మధ్యనే కంటి ఆపరేషన్ జరిగిందని, ఇంట్లో నా భార్య, మనవడు, మనవరాలు ఉండగా పెద్ద శబ్దం వచ్చిందని వారు చూసేసరికే ఇల్లు మొత్తం మంటల్లో కనిపించిందని వివరిస్తూ కన్నీరుమున్నీరైయాడు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల జనాలు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని, ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున అలుముకునేసరికి లోపలికి వెళ్లలేకపోయామని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, టీవీ, కూలర్, మంచాలు అన్ని మంటల్లో కాలి బూడిదైపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మధ్యనే ఇల్లు తాటి ఆకులతో నిర్మించుకున్నానని అందుకు నాకు 40 వేల రూపాయలు ఖర్చు వచ్చిందని, ఇప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page