![]()
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శ్రీ ఆదిత్య సాయి ఫెర్టిలైజర్ షాప్ దగ్ధం
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 19
పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్ లో గల శ్రీ ఆదిత్య సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ ఆదివారం రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు పురుగు మందులు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రెండు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. అప్పటికే సరుకు పూర్తిగా కాలిపోవడంతో షాప్ యజమాని, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖసాగరంలోకి వెళ్లారు.


