![]()
- దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
- ప్రతి గూడేలలో, తండాలలో, గ్రామాలలో ఎమర్జెన్సీ హెల్త్ క్యాంపులు పెట్టి విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలి
- తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, జులై 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కేంద్రం శేషగిరి భవనంలో తెలంగాణ గిరిజన సమైక్య సమితి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో విష జ్వరాలు ప్రభలకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని, ప్రత్యేకంగా దోమల నివారణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో దోమల విజృంభణ చేస్తున్నాయని అన్నారు. జూన్ నెల నుండి కురిసే వానలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో విత్తనాలు విత్తుకునేందుకు ఆ వానలు ఉపయోగపడతాయి. కానీ మండు వేసవిలో వర్షాలు పడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల కారణంగా దోమలు విజృంభించి మలేరియా వ్యాప్తికి దోహదపడతాయి. నిలువ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. వీటిని ఆ దశలోనే నిర్మూలించేందుకు క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తుంటారు. అయినప్పటికీ దోమలు స్వైర విహారాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రతి గూడేలలో, తండాలలో, గ్రామాలలో ఎమర్జెన్సీ హెల్త్ క్యాంపులు పెట్టి భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రజలను సీజనల్ వర్షాకాల విష జ్వరాల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు రాంచందర్ నాయక్, ఎక్స్ సర్పంచ్ గుగులోతు నగేష్, ఎంపిటిసి మూడు గణేష్, గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు బానోతు బాలాజీ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


