![]()
శిక్ష సప్తాహ్ లో విద్యార్థుల సామర్ధ్యాల ప్రదర్శన
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జులై 23
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు మంగళవారం శిక్ష సప్తాహ్ లో భాగంగా రెండో రోజు బొమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక భాషా గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో వారి సామర్థ్యాలను, ప్రతిభ ను ప్రదర్శింప చేయడం జరిగింది. హెచ్ఎం, ఎం.జ్యోతిరాణి విద్యార్థులకు శిక్ష సప్తాహ్ యొక్క లక్ష్యాలను విశదీకరించారు. ఈనెల 29 వరకు జరగనున్న ఈ శిక్ష సప్తాహ్ లో భాగంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో ఈరోజు ఫౌండేషనల్ లిట్రసి అండ్ న్యూమరసి ప్రోగ్రాం ( ఎఫ్.ఎల్. ఎన్ ) ను జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖలు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరిగింది. విద్యార్థులతో నీతి కథలు కూడా చెప్పించారు. గణిత శాస్త్ర భోదనోపరికరాలు, ఉపయోగాలను వివరించారు.


