![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09
మండల పరిధిలోని పోకలగూడెం గ్రామంలో ఆదివారం మండల బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో నరేంద్ర మోధీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు గుగులోత్ శ్రీను మాట్లాడుతూ కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోధీ నాలుగోసారి ప్రధానమంత్రిగా చూడాలన్నదే నా కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోకలగూడెం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


