![]()
- అడిగేవాడు ఎవడైతే మాకేంటి, ఇచ్చేదేలే అన్న అహంకార ధోరణిలో సింగరేణి అధికారులు
- పి.ఐ.ఓ అధికారులారా సెక్షన్ 8(1)(జె) అర్థమేమిటి..?
- సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ సమాచారం అడిగినా ఇవ్వడం కుదరదు అంటూ దరఖాస్తు తిరస్కరణ
- సామాజిక కార్యకర్త కర్నే బాబురావు
మణుగూరు, మన భద్రాద్రి బ్యూరో, జులై 03
సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ సివిల్ డిపార్ట్మెంటులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించి కొన్ని వివరాలు ఇవ్వవలసిందిగా కోరుతూ మణుగూరుకి చెందిన సామాజిక కార్యకర్త కర్నే బాబురావు దరఖాస్తు చేశారు. దీనికి గాను సంబంధిత అధికారులు స్పందిస్తూ సింగరేణి జీఎం ఆఫీస్ పిఐఓ లు ప్రజా ప్రయోజనం లేనిది సమాచార హక్కు చట్టం సెక్షన్ 8(1)(జె) ప్రకారం ఇవ్వడం కుదరదు అంటూ సివిల్ డిపార్ట్మెంట్ కు చెందిన ఏజీఎం సమాధానం ఇవ్వటం గమనార్హం. పిఐఓ లు ఉండగా సివిల్ ఏజియం ఏ విధంగా సమాధానం ఇస్తారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇవ్వవలసిన సమాచారం సివిల్ ఏజీఎం కి ఏ సంబంధం అని పలువురు మాట్లాడుతున్నారని కర్నే బాబు తెలియజేశారు.


