![]()
దేశ పరిస్థితుల నేపధ్యంలో 20న జరుగవలసిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా: సీఐటీయు.
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్ మే 16
మే 20 న జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను దేశ పరిస్థితుల నేపధ్యంలో జూలై 9కి వాయిదా వేసిన నట్లు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్ లు డిల్లీలో సమావేశమై పెహెల్గవ్ ఉగ్ర దాడి భారత్ పాక్ యుద్ధ వాతావరణం ఏర్పడి దేశం మొత్తం లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జూలై 9కి వాయిదా వేసినట్లు ఆ అంశాన్ని తేలడానికి అన్ని కార్మిక రంగాల సమావేశాలు ఏర్పాటుచేసి సమ్మె వాయిదా అంశాలు వివరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మే 20 న ర్యాలీలు,సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సమ్మె ప్రచారం లో తిరిగిన కార్యకర్తలకు,సభ్యులకు, సహకరించిన అధికారులకు,యజమానులకు, కార్మికులకు,మద్దతును ఇచ్చిన రైతు వ్యవసాయ కూలీలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఆర్టీసీ ఇల్లందు డిపో కమిటీ సమావేశం డిపో అధ్యక్షులు ఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి జే ఉపేంద్ర చారి, అంజన్న, నాగరాజు తాళ్లూరి కృష్ణ , ఏ ఉమాదేవి, పీ లక్ష్మణ్ రావు, కే కోటయ్య తదితరులు పాల్గొన్నారు.


