![]()
సాహస నారి కెప్టెన్ లక్ష్మీసెహగల్ వర్ధంతి సందర్భంగా సీపీఎం నివాళి
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జులై 23
భారత స్వాతంత్ర సంగ్రామంలో సాహస నారీ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ పేరు చిరస్మరణీయం. వైద్యురాలిగా ఆమె చేసిన సేవలు అజరామరం అని స్థానిక ఏలూరి భవన్ వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మన్యం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో క్షతగాత్రులైన సైన్యానికి విశిష్ట సేవలు అందించారు. పేదలు, కార్మికులెందరికో ఉచిత వైద్యం చేసి ప్రాణాలు నిలిపారన్నారు. అంతకు మించి మరో చరిత్ర సృష్టించారు. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి రెజిమెంట్‌కు అధినేత్రిగా వ్యవహరించారు. ప్రపంచ చరిత్రలో మహిళా ఎవరు రెజిమెంట్ బాధ్యత నిర్వహించిన చరిత్ర లేదన్నారు. సింగపూర్ లో భారత మహిళలు అప్పట్లో తేయాకు తోటలలో వెట్టి చాకిరి చేసేవారు.
వారిపై యజమానులు లైంగిక దాడులు చేసేవారు. అటువంటి మహిళలందరినీ లక్ష్మీ సెహగల్ చైతన్యపరిచారు నేతాజీ సమక్షంలో ఐదువేల మంది మహిళలను సమావేశపరిచారు. మహిళలు ఎంతో ఉత్సాహంతో మేము స్వతంత్రులమే మేము సైనికులం మా మీద ఇక ఎవరూ పెత్తనము చేయలేరు అని తమకు స్వతంత్రం వచ్చినట్లు ఉత్తేజపడ్డారు .వారిలో 15 వందల మంది మహిళలు సైనిక శిక్షణ పొందారు. ఝాన్సీ రాణి రెజిమెంటులో 1000 మంది సన్నద్ధులుగా యుద్ధభూమిలో నిలిచారు 200 మంది నరసలుగా సేవలందించారు.కడ వరకు ఎత్తిన జెండా దించకుండా పేద బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ,వరంగంటి రాజమొగిళి, ఆర్‌బిజె రాజు, నాగరాజు, సత్యనారాయణ కోరి, వీరయ్య, శ్రీను, బాబు, తదితరులు పాల్గొన్నారు.


