![]()
సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్
తెలంగాణ- చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం మరియు ధర్మారం సిఆర్పీఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు. అక్కడ అధికారులను సరిహద్దు ఏజెన్సీ గ్రామాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిషేధిత సిపిఐ మావోయిస్టులు దాడికి పాల్పడిన ధర్మారం క్యాంపును సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల దాడిని పోరాట పటిమతో ఎదుర్కొని, వారి కుట్రను భగ్నం చేసిన సిఆర్ పీఎఫ్ అధికారులు మరియు సిబ్బందిని ప్రశంసించారు. క్యాంపుల నందు విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపారు.


