![]()
సిఆర్పిఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోండి…
సిఆర్పిఎఫ్ 218 బెటాలియన్ కమాండెంట్ ఖలీద్ ఖాన్
తిప్పాపురం టోంగూడ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహణ
చర్ల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 21
సిఆర్పిఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు సిఆర్పిఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు నిర్వహించే సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలని అన్నారు. సోమవారం తిప్పాపురం,టోంగూడ గ్రామాల్లో సిఆర్పిఎఫ్ 218 బెటాలియన్ అధికారులు 218 కమాండెంట్ ఖలీద్ ఖాన్ మార్గదర్శకంలో సిఆర్పిఎఫ్ 218 బెటాలియన్ సీఎంఓ సమక్షంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఈ మూడు గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు రాజన్ కుమార్ సి ఎం ఓ నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామా అభివృద్ధికి మీ అందరి ఆరోగ్యం ప్రయోజనాలు కోసం సిఆర్పిఎఫ్ 218 బెటాలియన్ అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. పౌర కార్యాచరణ కార్యక్రమం కింద తాము భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఎటువంటి సమస్యలు ఎదురైనా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. గ్రామస్తులు అధికారులతో స్నేహభావంగా ఉండాలని గ్రామంలో ఏదైనా సమస్య తలెత్తితే దగ్గర్లోని క్యాంపు అధికారులకు తెలియజేయాలని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్య క్రీడల్లో మక్కువ చూపించాలని యువతకు సూచించారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు వచ్చిన అనుమానస్పదంగా ఎవరైనా గ్రామంలో తిరిగిన తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఏ218 అసిస్టెంట్ కమాండెంట్ సిలక్ రామ్, 218 అసిస్టెంట్ కమాండెంట్ సందీప్,పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులు పాల్గొన్నారు.


