Monday, March 23, 2026
HomeHyderabadసిగ్గులేని టాలీవుడ్..

సిగ్గులేని టాలీవుడ్..

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఒక్క కాకి చనిపోతే వందల కాకులు వస్తాయి, ఓ కోతి గాయపడితే వంద కోతులు వస్తాయి. జంతువుల్లోనే ఇంత ఐకమత్యం ఉంటే.. మనుషులమైన మనం, అందులోనూ ఒకే రంగానికి చెందిన వ్యక్తులు ఇంకెలా ఉండాలి.

చెప్పేది ఎవరి గురించి అనుకుంటున్నారా.. మన అభిమాన తారలు, సినీ హీరోలు, దర్శకనిర్మాతలు. వీళ్లంతా ఏదో ప్రజాసేవ చేస్తున్నట్లు వీళ్లు వేలల్లో ఫ్యాన్స్ ఉంటారు. సినిమాల్లో మాత్రమే వారంతా హీరోలు బయట జీరోలు అని మరో సారి నిరూపించుకున్నారు. ఫిష్ వెంకట్ అనే యాక్టర్ నెల రోజులపాటు హాస్పటల్‌లో ప్రాణాలతో పోరాడాడు. రెండు కిడ్నీలు పాడై ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జూలై 18న రాత్రి (శుక్రవారం) కన్నుమూశారు. ఆయన ఇంటిముందు మృతదేహం పెట్టడానికి చోటు కూడా లేక రోడ్డుపై పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన కుటుంబం ఎంత పేదరికంలో ఉందో. ఫిష్ వెంకట్ ఫ్యామిలీని పరామర్శించడానికి ఏ ఒక్క హీరో, డైరెక్టర్, నిర్మాత కూడా రాలేదు.

అంత్యక్రియలకు రాని సినీ ప్రముఖులు..

నిజానికి ఆయన చనిపోలేదు. ఆయన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోని కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి ఉంటే ఆయన బతికి ఉండే వాడు. ఫిష్ వెంకట్ వైద్యం కోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. దాదాపు నెల రోజులపాటు ఫిష్ వెంకట్ కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురు చూసింది. టాలీవుడ్‌లో ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే ఆయన బతుకుతారని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యలు వేడుకున్నారు. ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించారు. సినిమాలో కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఒక్క రూ.50 లక్షలు ఫిష్ వెంకట్‌కు సాయం చేయలేక పోయారు. వందలు, వేలల్లో టాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు. అందులో ఓ 50 మంది ముందుకు వచ్చి తలో రూ.లక్ష సాయం చేసినా ఆయన బతికి ఉండేవారని వాదనలు ఇప్పడు వినిపిస్తున్నారు.

100పైగా సినిమాల్లో స్టార్ హీరోస్‌తో ఫిష్‌ వెంకట్‌

పెద్ద సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి మరీ ఫ్యాన్స్ రక్తాన్ని పీల్చుతారు సినీరంగ ప్రముఖులు. డబ్బున్న వ్యక్తులు, ఒక్కరోజు అరెస్ట్ అయితే క్యూలో వెళ్లి మరీ పరామర్శిస్తారు. కానీ చిన్న స్థాయిలో ఉన్న ఓ సాధారణ యాక్టర్‌ని చావు వెంటాడుతుంది అంటే ఎవరూ పట్టించుకోలేదు. వందకుపైగా సినిమాల్లో ఎంతోమంది సీనియర్‌ యాక్టర్స్‌తో ఫిష్‌ వెంకట్‌ నటించారు. కానీ ఆయన మృతిపై ఒక్కరూ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మృతిని టాలీవుడ్‌ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది. తామంతా టాలీవుడ్ ఫ్యామిలీ అని చెప్పుకునే వారు ఇప్పుడు మృదేహాన్ని కూడా చూడడానికి రాలే.

ఆ సినిమాలో ‘ఒక్కసారి తొడకొట్టు చిన్నా’

ఎన్నో సినిమాల్లో తనదైన శైలి కామెడీతో అలరించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్‌ వెంకట్‌. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో నవ్వులు పూయించారు. విలన్స్ గ్యాంగ్ లో కమెడియన్ గా రాణించారు. పెద్ద పెద్ద నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్ వంటి స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. 2002లో ఆది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఫిష్‌ వెంకట్‌.. ఆ సినిమాలో ఒక్కసారి తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో ఫేమస్‌ అయ్యారు. దీంతో అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత వీవీ వినాయక్‌ డైరెక్షన్‌లో చాలా సినిమాల్లో నటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page