Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల

సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల

Loading

సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల

కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో

ముంబైలో డిసెంబర్ 20 నుంచి 24 వరకు జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్ రావు ( ఐటిసి రిటైర్డ్ ఎంప్లాయి ) అనే క్రీడాకారుడు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రీడాకారుడు గతంలో కూడా జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పథకాలను సాధించడం జరిగింది. ఈ బంగారు పథకాలు సాధించిన క్రీడాకారుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అభినందించడం జరిగింది. అంతేకాకుండా తర్వాత జరగబోయే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవీ రామిరెడ్డిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు క్రీడా పరంగా పేరు తీసుకు వస్తున్నటువంటి రామిరెడ్డిని మరియు రామ్మోహన్ రావుని అభినందించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page