![]()
సిసి రోడ్లు పనులను దగ్గరుండి పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ ఏఈ
చండ్రుగొండ, మన భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, రావికంపాడు గ్రామంలో సీసీ రోడ్డును కొత్త ప్రభుత్వం మంజూరు చేయగా కుక్కల ముత్యాలరావు ఇంటి దగ్గర నుంచి మద్యబోయిన వెంకటేశ్వర్లు ఇంటి వరకు నిర్మాణ పనులు చేపట్టారు. అట్టి రోడ్డును పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాసరావు దగ్గర ఉండి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రావికంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోగిన బోయిన కోటేశ్వరరావు, కుక్కల ముత్యాలరావు, మద్దిబోయిన వెంకటేశ్వర్లు, పిన్నిబైన సతీష్, బానోత్ కిషన్, బండారి భాస్కర్ ఇనుముల సైదులు తదితరులు పాల్గొన్నారు.


