![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 30
సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సీఐటీయూ ఇల్లందు మండల కమిటీ, మున్సిపల్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లందు, పినపాక నియోజక వర్గాలలో ఇల్లందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలలో అబ్దుల్ నభి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోధీ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడం వల్ల, దేశంలో కార్మిక, కర్షకులు అనేక అవస్ధలు పడుతున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాళ్లూరి కృష్ణ అధ్యక్షత వహించగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ కార్యచరణ తీసుకున్నదని అన్నారు.
దానికి వ్యతిరేకంగా సీఐటీయూ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
మన్యం మోహన్ రావు కామ నాగరాజు, మహమూద్, వెంకన్న, భద్రూ, వెంకటేశ్వర్లు, మూడు సుగుణ, ఎల్కాపల్లి శ్రీనివాస్, చుక్కా రాంచందర్, హుస్సేన్, రాజు, ప్రేమ్ సింగ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.


