![]()
- నత్త నడకన జరుగుతున్న పనులు పై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం
- అధునాతన పద్ధతుల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ
- వచ్చే సీజన్ కల్లా పంట పొలాలకు నీరివ్వాలని ఆదేశాలు
దమ్మపేట, మన భద్రాద్రి న్యూస్, జనవరి 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ లతో కలిసి పరిశీలించారు. పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయగా నత్తనడకన వున్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పదమూడు వేల ఐదొందల కోట్ల ప్రాజెక్ట్ కు 7500 కోట్లు ఖర్చైనా 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్న తుమ్మల వచ్చే సీజన్ కి రైతాంగానికి నీరు అందివ్వాలన్నారు. అధునాతన పద్ధతుల్లో పనులు త్వరితగతిని పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. టన్నెల్ పనులు, నాలుగో యూనిట్ మినహా మూడు యూనిట్ లు తుది దశకు వచ్చినందున పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి కావాలన్నా వెంటనే ఇప్పిస్తానని, బేతుపల్లి , వైరా లకు మూడు నెలల్లో నీరు అందివ్వాలన్నారు. ఈ ఏడాది 1,50,000 ఎకరాలకు వచ్చే ఏడాది మరో లక్ష 50 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్న తుమ్మల టన్నెల్ పనులు పూర్తయ్యే వరకు పాలేరుకు నీరు అందే పరిస్థితి లేనందున ఈ లోపు మిగిలిన పనులన్నీ వేగవంతం చేయాలన్నారు.


