![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 04
మండలంలోని మద్దుకూరు గ్రామంలో సుండ్రు విజయ్ కుటుంబం గత ఎన్నో సంవత్సరాల నుంచి తన అన్న సుబ్బారావు, నిర్మల దంపతుల కుమారుడు కేశవ్ ప్రమాదంలో చనిపోయిన నాటి నుండి సుమారు ఇరువై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కేశవ పేరు మీద జరుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మద్దుకూరు గ్రామంలో జాయిస్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుంజ రామకృష్ణ సుండ్రు విజయ్ ను సంప్రదించగా వారి ఫౌండేషన్ ద్వారా సుమారు యాభై మంది విద్యార్థులకు సాయంత్రం పూట ట్యూషన్ చెప్పి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పగా సుండ్రు విజయ్ వెంటనే తన అన్న కుమారుడైన సుండ్రు కేశవ్ జ్ఞాపకార్ధంగా నెలకి 3,000 రూపాయల చొప్పున జీవితకాలం పిల్లలకి ట్యూషన్, భోజనం నిమిత్తం అందిస్తామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన నల్లమోతు నాగేశ్వరరావు, డాక్టర్ వీరారావు వీరి ఇరువురు కలిసి పిల్లలకి కొంత మొత్తంగా పిల్లలకు సహాయం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో వారి కుటుంబం ఎల్లవేళలా ముందుంటుందని విజయ్ తెలిపారు. మద్దుకూరు గ్రామంలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులు మండలంలో టాపర్ గా నిలిచిన విద్యార్థికి 5,000 రూపాయలను ప్రోత్సహంగా అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.


