Monday, March 23, 2026
HomeTelangana Newsస్కూల్ విద్యార్థుల యూనిఫాములు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగింత

స్కూల్ విద్యార్థుల యూనిఫాములు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగింత

Loading

-తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 13

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.గవర్నమెంట్ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే భాద్యతను మహిళా సంఘాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకుఈ యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది.63.44 లక్షల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి.ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది.ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందించాలని సూచించారు.రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలకు 63.44 లక్షల జతల యూనిఫామ్స్ అవసరమ వుతాయి.ఈ యూనిఫా మ్స్‌ను 45 రోజుల్లో మహిళా సంఘాలు కుట్టి అప్పగించవలసి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page