Monday, March 23, 2026
HomeTelangana NewsKhammam Newsస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తుమ్మల

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తుమ్మల

Loading

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కష్ట కాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఇప్పుడు ఒక చూపు చూడాల్సిందేనని పిలుపు నిచ్చారు. తాను కూడా అదే పద్ధతి పాటిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకుండా ఇప్పుడు పార్టీలోకి రావాలని చూసే వారిని రానివ్వమని చెప్పారు. ఒకవేళ వచ్చినా వారికి ఎలాంటి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొద్దన్నారు. గ్రామాల్లో అందరినీ కలుపుకుని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతిఒక్కరికి అందేలా చూడాలని చెప్పారు.

కార్యకర్తలకు సహకరించేందుకు నేతలు సిద్ధంగా ఉండాలని తుమ్మల సూచించారు. కాగా తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో ఏపీ, తెలంగాణ రైతులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. పామాయిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తే రైతుకు చాలా నష్టం వస్తుందన్నారు. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ ఓఈఆర్ ఫార్మాలా ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రైతులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తుమ్మల పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page