Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemస్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధి కల్పించాలి

స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధి కల్పించాలి

Loading

స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధి కల్పించాలి

  • భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్

బూర్గంపహాడ్ మండలం, సారపాక కార్యాలయంలో భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన భద్రాద్రి జిల్లా కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా జరిగింది. కమిటీ సభ్యుల అంగీకారంతో భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన కమిటీ వేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు కందుల సుజాత మాట్లాడుతూ సారపాక గ్రామంలో అనేకమంది పేద మహిళలు ఉన్నారని, వారందరూ కూడా రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, మహిళలందరూ తమ తమ కాళ్ళపై నిలబడేందుకు ఐటిసి, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని, ఉపాధి అవకాశాలు స్థానిక మహిళలకు, యువతకు కల్పించాలని కోరారు.

ఈ ఫౌండేషన్ ద్వారా స్థానిక సమస్యలు, మహిళల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తుందని, మహిళలు అందరూ అన్ని రంగాల్లో ముందుండాలని, అందుకు ఈ సంస్థ తమ సహకారం అందిస్తుందని ప్రధాన కార్యదర్శి గంపల రవి కుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు భవాని, జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమారి, కోశాధికారి పర్వీన్, సహాయ కోశాధికారి సుమతి, సభ్యులుగా స్రవంతి, లకుమా దేవీ, మేరీ, లక్ష్మి, ప్రియ, జయ, శాంతి, భాగ్యం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page