Monday, March 23, 2026
HomeTelangana Newsహైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

Loading

హైదరాబాద్ లో హై అలర్ట్‌.. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..మిస్ వరల్డ్‌ పోటీలకు వచ్చే అతిథుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు భట్టి విక్రమార్క.

శనివారం(మే 10) నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. చాలా దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అందాల పోటీలకు వచ్చిన అతిథులకు భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు అధికారులు.

తెలంగాణలో శాంతిభద్రతలపై అధికారులతో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వారికి భారీ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీదారులు విడిది చేసే హోటల్స్‌లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని భట్టివిక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో పౌరుల భద్రతపై.. డిఫెన్స్ మాక్ డ్రిల్‌పై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని భట్టివిక్రమార్క తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page