![]()
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
మన భద్రాద్రి వెబ్ డెస్క్:
దేశంలో హోలీ పండగకు ముందే పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. నిన్నటితో పోల్చితే నేటి గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం నేడు హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 87,980 కి చేరింది. ఇది నిన్నటితో పోల్చితే రూ. 630 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80,650 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 88,140 కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80,810కి చేరింది.
మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం వెండి ధరలు ఢిల్లీలో కిలోకు రూ. 1,00,100 స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పూణే, లక్నో, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో వెండి ధరలు ఏకంగా రూ. 2200 పెరిగి రూ. 109,100 స్థాయికి చేరాయి. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు వినియోగదారులు నివ్వెరపోతున్నారు.


