![]()
కొత్తగూడెం, మన భద్రాద్రి స్టాఫ్ రిపోర్టర్, జూలై 22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తోక బంధాల గ్రామానికి చెందిన నిండు గర్భిణి పడిగే కాంతకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో భర్త రాజశేఖర్ వెంటనే 108 కు సమాచారం అందించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 108 సిబ్బంది హుటాహుటిన వారి ఇంటికి చేరుకొని, మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో కొత్తగూడెం తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే నొప్పులు అధికమవ్వడంతో 108 ఈఎంటి పరమ ఆకాష్ గర్భిణీకి కాన్పు నిర్వహించగా బాలింత కాంత పండంటి పాపకి జన్మనిచ్చిందని, తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. బాలింతరాలు కాంత, భర్త రాజశేఖర్ 108 సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనప్పటికీ 108 సిబ్బంది సకాలంలో రావడంతో సుఖ ప్రసవం జరగడం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం పట్ల మాకు ఎంతో సంతోషంగా ఉందని, వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.


