![]()
సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారునికి భద్రాచలం డాక్టర్ల అభినందనలు
- సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
జులై నెల 21 నుండి 25 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు గాలి రామ్మోహన్ రావు 74 సంవత్సరాల వయస్సులో 4 బంగారు పథకాలను సాధించడం జరిగింది . రామ్మోహన్ రావు గతంలో కూడా 6 బంగారు పథకాలు జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. ఈ పథకాలు సాధించిన గాలి రామ్మోహన్ రావును భద్రాచలం డాక్టర్స్, జీవన్ హాస్పటల్ కు చెందిన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మిమ్స్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ గురు తేజ, మరియు నేషనల్ పవర్ లిఫ్టర్ మహంతి వెంకట కృష్ణాజి ( సుధా జ్యువెలర్స్ అధినేత), గుగులోతు శోభన్ నాయక్ ( ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ) మరియు సిటీ స్టైల్ జిమ్ సభ్యులు అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 74 సంవత్సరాల వయస్సులో బీపీ మరియు షుగర్ వంటి రోగాలతో హాస్పిటల్స్ కు వచ్చి మెడిసిన్స్ వాడే పరిస్థితి ఉంటుందని, గాలి రామ్మోహన్ రావు ఆ వయస్సు వారందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా ఉండటమే కాకుండా భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు, భద్రాచలానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, క్రీడా పరంగా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. డాక్టర్ గురుతేజ, ఎముకల వైద్య నిపుణులు మాట్లాడుతూ, 74 ఏళ్ల వయస్సులో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అని వచ్చే పేషెంట్లు కనపడతారు తప్పితే, ఇలా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్న గాలి రామ్మోహన్ రావుని అందరూ ఆదర్శంగా తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా, ఎదో ఒక క్రీడలో నైపుణ్యం సంపాదించి తమ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు.


