Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి

రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి

Loading

రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి

  • ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ రాక…
  • బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలిరండి…
    • జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు.. తోటమల్ల రమణమూర్తి

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, మే 15

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఈనెల 25న భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు తెలంగాణ సామాజిక ఉద్యమకారులు,తెలంగాణ నిప్పు కణిక,గౌరవ ఎం ఎల్ సి డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొననున్నారని,కావున ఈ సదస్సుకు వేలాదిగా బడుగు,బలహీన వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి పిలుపునిచ్చారు.మే,25 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు,పలు ప్రజా, కుల సంఘాలు, సంయుక్తంగా భద్రాచలం పట్టణం లోని కేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సుని పురస్కరించుకొని గురువారం జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించి 77 సంవత్సరాలైనా 140 కోట్ల మందిని ఏకం చేస్తూనే ఉందని,ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పాలనా వ్యవస్థలను నేటికీ చెక్కుచెదరకుండా కాపాడుతుందని ఆయన అన్నారు.అలాగే భారత రాజ్యాంగం ఇంత గొప్పగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ గారి జ్ఞాన శీలత, దీర్ఘ దృష్టి అనే విషయం గుర్తుంచుకోవాలని, అటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుయుక్తులను తిప్పుకొట్టడానికి సమాజం ఏకం కావాలనే లక్ష్యంతో ఈనెల 25న భద్రాచలం పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ప్రజలు వేలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, పలువురు రాష్ట్ర నాయకులు,పలు సంఘాలకు చెందిన నాయకులు,పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,మేధావులు, విద్యావేత్తలు, అంబేద్కర్ వాదులు, పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ ఎడేళ్ల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య, మహిళా జిల్లా కార్యదర్శి మద్దేటి జయ,చర్ల మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు, ఐటీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కొంగూరు శ్యామ్, నాయకులు కార్లపూడి సుందర్ పాల్, పప్పుల జయ, బొజ్జ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page