Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

బూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

Loading

బూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ లో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు


బూర్గంపాడు, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06


భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండలం లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చెన్నం హనుమంతరావు సెక్రటరీ యడారి శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి జర్నలిస్ట్ వేడుకలు ఘనంగా వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భద్రాచలం రవాణా శాఖ అధికారి సంగం వెంకట పుల్లయ్య ముందుగా కేక్ కటింగ్ చేసి మాట్లాడుతూ అందరికీ జర్నలిస్టు డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పెన్ను గన్ను లాంటిదంటూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని, ప్రభుత్వానికి ప్రజలకు వీరు వారదులనని, సమాజ సేవలో వీరి కృషి ఎంతో అభినందనీయమని, ఎటువంటి ఒత్తిళ్లు ఎదురైనా నిజాన్ని నిర్భయంగా చూపగల చెప్పగల నిస్వార్థపరులని ప్రస్తుత సంఘటనలు వాస్తవాలు సమాచారాలను ప్రజలకు అందించడానికి ప్రజలను చైతన్య పరచడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను గౌరవించడం అందరి బాధ్యత అని తెలియజేశారు, అదేవిధంగా మాజీ సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు పై ప్రతినిత్యం పోరాడుతూ, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ వారిని చైతన్యవంతులు గా తయారు చేస్తున్న జర్నలిస్టులను వారిపై గల అత్యంత గౌరవంతో శాలువాలతో సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని వారికి మా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలియజేశారు, అనంతరం ప్రెస్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలు కమిటీ సభ్యులందరికీ జ్ఞాపికలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు డేరంగుల రవి, రాజేష్ రెడ్డి, రాజు, ఆర్ వెంకట్, సాయి కౌశిక్, నవీన్, రామకృష్ణ, జీవన్ శౌర్య, భరత్, లక్ష్మణ్, ఋషి కుమార్, సాలయ్య బాబాజీ, ఎండి పాషా, బూర్గంపహాడ్ ఎస్ఐ మేడ ప్రసాద్ బూర్గంపహాడ్ ఎంపీడీవో, సారపాక పంచాయితీ కార్యదర్శి మహేష్, ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, రోటరీ క్లబ్ గవర్నర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీ, పి ఎ సి సి చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీష్, తుపాకుల రవి, గోనెల నాని, కొనకంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page