![]()
30 ఏళ్ల కల నెరవేరబోతోంది
గ్రామస్తుల ముఖంలో చిరునవ్వులు
జారే ఆదినారాయణ పై పొగడ్తల జల్లు
పారదర్శకంగా ఇల్లు ఎంపిక
ఆనందంలో మండల ప్రజలు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను కానీ ఆర్థిక పరిస్థితి బాగా లేక కట్టుకోలేకపోయాము మధ్యలో కట్టుకుందామన్న గత ప్రభుత్వం మాకు ఇల్లు ఇవ్వలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మా కల నెరవేరుతుంది అని మన భద్రాద్రి న్యూస్ రిపోర్టర్ తో ఆనందాన్ని పంచుకున్నారు. అశ్వరావుపేట శాసనసభ్యులు నారాయణ మొదటి మా గ్రామానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా ఇల్లు ఇస్తానని మాట ఇచ్చిండు మాట తప్పకుండా ఈరోజు మా గ్రామంలో అందరికీ ఇల్లు నిర్మిస్తున్నాడు.
మేము గత 30 ఏళ్ల నుంచి గుడిసెలోనే రేకుల్లోనే నివాసం ఉంటున్నామని ఈ రోజున మాకు ఈ ఇల్లులు ఇచ్చినందుకు ఆదినారాయణ కు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. గ్రామంలో చాలామంది నిరుపేదలను ఎంపిక చేసి నిరుపేదలు కూడా ఆర్థికంగా ఎదగాలని ఎటువంటి అవినీతి ,పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి ఇల్లును నిర్మించేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఎవరి కళ్ళల్లో చూసిన ఆనందంతో వెల్లువిరుస్తున్నాయి.

నేను గత 30 సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఈరోజుతో నా కల నెరవేరింది – బెండలపాడు గ్రామస్తుడు

నేనెప్పుడూ కల గన లేదు ఇల్లు కట్టుకుంటానని.. కానీ జారే ఆదినారాయణ కృషి ఫలితం వల్ల ఈరోజు ఇల్లు నిర్మించుకుంటున్నాను – బెండలపాడు గ్రామస్తురాలు

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఒక ఎమ్మెల్యే అని అనుకోవడం లేదు. ప్రతి ఇంటికి ఈరోజు ఒక పెద్ద కొడుకు లాగా నిలబడుతూ ప్రతి గ్రామంలో నిరుపేదలకు అండగా ఉండి వాళ్ళని అభివృద్ధి పరచడంలో ముందుంటున్నాడు – నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి


