![]()
ఆటో కార్మికుల జనరల్ బాడీని విజయవంతం చేయాలి
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఐఎఫ్టీయూ పిలుపు
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 11:
తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బద్దుతండా, నంద్యాతండా, మద్దిరాల తండా, కుంటల, తుమ్మలచలక గ్రామాల పరిధిలోని ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్ తెలిపారు.
శనివారం టేకులపల్లిలో బానోత్ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న కార్మికులు అనేక ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆటో, మోటార్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివారం జరిగే జనరల్ బాడీ సమావేశానికి తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎండి రషీదుద్దీన్ ముఖ్య వక్తలుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఆటో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మోహన్, రమేష్, తరుణ్, నరేష్, కుమార్, గోపాల్, పుల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.








