![]()
ఎస్ఐఆర్ ఫారం అందజేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
– ప్రతి ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగస్వామి కావాలని పిలుపు
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 11
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ టేకులపల్లి మండలం దాసుతండాలోని తన స్వగృహంలో ఎస్ఐఆర్ నమోదు ఫారాన్ని పూరించి స్థానిక బీఎల్ఓకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహనతో పాల్గొని, స్థానిక బీఎల్ఓలకు అవసరమైన వివరాలను అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు.
2002 సంవత్సరానికి ముందు, తర్వాత ఓటు హక్కు పొందిన వారందరూ భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బాధ్యతాయుతంగా పాల్గొని, తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని బానోత్ హరిప్రియ నాయక్ పేర్కొన్నారు.








