![]()
ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..
ప్రిన్సిపాల్ డి వెంకటేశ్వరరావు
మణుగూరు, మన భద్రాద్రి, జూన్ 9:ప్రభుత్వ ఐటిఐ లోని ప్రవేశాల కోసం మొదటి విడత ప్రవేశాల గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ ఐటిఐ కృష్ణ సాగర్ ,మణుగూరు ప్రిన్సిపాల్ డి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటిఐ , ఏటీసీలలో మొదటి విడత ప్రవేశాల కోసం ఈనెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గం పరిధిలోని కృష్ణసాగర్ ,మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ఏటీసీలలో ఉన్న కోర్సులకు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కృష్ణ సాగర్ ఐటిఐ లోని ఎలక్ట్రిషన్ కోర్స్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో ఎలక్ట్రిషన్,ఫిట్టర్, డీజిల్ మెకానిక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుతున్నట్లు తెలిపారు. కృష్ణ సాగర్ , మణుగూరు ఏటీసీలలో సి ఏన్ సి, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, వర్చువల్ ఎనాలసిస్ డిజైనర్ అండ్ ఫినేట్ ఎలిమెంట్ మెథడ్ కోర్సులలో ప్రదేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30లోగా ఆన్లైన్లో తమ దరఖాస్తులను అందజేయవలెనని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల కోసం నేరుగా ప్రభుత్వ ఐటిఐ కృష్ణసాగర్, మణుగూరుల లో సంప్రదించాలన్నారు. కృష్ణసాగర్ ఐటిఐ కోసం 6305949086, 9866463716,లకు, మణుగూరు ఐటిఐ కోసం 9848853255, 9492959511లకు ఫోన్ చేసి తెలుసుకోవాలనారు.








