![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 29:
గుండాల మండలం బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిట్ట రాములు, నిట్ట వెంకన్న తండ్రి నిట్ట సమ్మయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు పరామర్శించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం, 15 కిలోల వంట నూనెను అందజేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా నిలవడం బీఆర్ఎస్ పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ బాసటగా ఉంటుందని, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు గడ్డం వీరన్న, యువజన విభాగం అధ్యక్షుడు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం రమేష్, ఉపసర్పంచ్ తాటి పాపారావు, పొంబొయిన సుధాకర్, గడ్డం రామకృష్ణ, చేబోతు రంజిత్ కుమార్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.







