![]()
గాంధీనగర్లో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, జూలై 10 (మన భద్రాద్రి న్యూస్):
మణుగూరు మండలం, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహం గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు విస్సవజ్జుల యామిని దుర్గ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








